హిందువుల హక్కులను కాలరాస్తే సహించం :శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర లో ప్రవీణ్ భాయి తొగాడియ

భాగ్యనగరం , ప్రతి సంవత్సరం లాగానే ఈ సారి హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జరిగే ” శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర ” అంగరంగ వైభవంగా జరిగింది , గౌలిగూడ శ్రీ రామ ఆలయం నుండి ప్రారంభమైన యాత్రకి ప్రజలనుండి అనూహ్య స్వాగతం లభించింది దాదాపు అరవై వేల ద్విచక్ర వాహనాలో లక్షకి పైగా భజరంగీలు ఈ యాత్రలో పాలోనడం జరిగింది

హిందువుల హక్కులను కాలరాస్తే సహించం : ప్రవీణ్ భాయి తొగాడియ

యాత్ర ముగింపు సమావేశం లో మాననీయ ప్రవీణ్ భాయి తొగాడియ ప్రసంగిస్తూ ఈ దేశం హిందు వ్యతిరేక దేశం గా మారబోతుందని అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు రక్షణ లేకుండా పోతుంది , మన రాజకీయ నాయకులు తమ స్వార్ధానికి హిందు సమాజాన్ని పణంగా పెడుతున్నారు అలాంటి వారికి సామాజిక , ఆర్ధిక భాహిష్కరణ చేయాలి , వారిని హిందు ఉత్సవాలకు ఆహ్వానించొద్దు అప్పుడు వారికి హిందు సమాజ విలువ తెలుస్తుంది , అలాగే మనం మన ఓటును హిందుత్వం కోసం పనిచేసే నాయకులకే వేయాలని ” మన ఓట్లు ప్రాంతం పేరుతొ , కులం పేరుతొ ” విడిపోయినంత కాలం మన రాజకీయ నాయకులు ముస్లింల గడ్డం దువ్వుతారని , ఈలాంటి పరిణామాల నుండి హిందు దేశాన్ని రక్షించడానికి హిందు ఓటు బ్యాంకు నిర్మాణం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు.

మత ప్రాతిపతిక రిజర్వేషన్లకు ఈ దేశంలోని హిందులకు ప్రాణ సంకటం గా మారాయని , ఇవి దేశ సమైక్యతకు భంగం కలిగిస్తాయి ఈ దేశం హిందువులది కాబట్టి హిందువులే ఈ దేశ సమైక్యతను కాపాడుకోవాలి , ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విశ్వ హిందు పరిషద్ దేశవ్యాపితంగా ఒక ఉప్పెన లాంటి మహోద్యమాన్ని నిర్మాణం చేయబోతుందని ఆ ధాటికి హిందు వ్యతిరేక శక్తులు నశించిపోవడం తధ్యమని ఆయన అన్నారు .